తెలుగు తేజం, నందిగామ : కృష్ణ జిల్లా నందిగామ శ్రీవిద్యా స్కూల్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా సీఐ కనకారావు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు విజేతలను ఎంపీడీవో లీల డిప్యూటీ తాహసిల్దార్ రిబిక రాణి ఎంపిక చేశారు. విజేతలకు డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు వేయడానికే మొదటి ప్రాధాన్యత మహిళలుఇస్తారని ఇక్కడ ముగ్గులు పోటీలకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని తెలుగు సాంప్రదాయం ఊట్టి పడేలా ముగ్గులు వేశారన్నారు.
సాంప్రదాయం కు తగ్గట్టుగా మహిళలు అందరినీ ఒకే చోటకు చేర్చి ముగ్గులు పోటీలు నిర్వహించడానికి కృషిచేసిన సీఐ కనకారావు ని ఆయన అభినందించారు.