తెలుగు తేజం, విజయవాడ : ఆధ్యాత్మిక విశ్వ గురువు, సైంటిఫిక్ సెయింట్, వైద్యానికి రిషి శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి 2021 డైరీ ఆవిష్కరణ సభ మొగల్రాజపురం లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రెండు డైరీలను ఆవిష్కరించటంతోపాటు 2021 టేబుల్ క్యాలెండరని సభలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్సీ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆళ్ల రాజేష్ మాట్లాడుతూ మనిషిలో మరుగున పడిపోతున్న మానవత్వాన్ని వెలికి తీయడమే శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారిఆశయమని తెలియజేశారు . ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మనిషి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని తెలియజేశారు. అలాగే సమాజంలో మార్పు రావాలంటే కేవలం నీతి బోధనలతో మార్పు సాధ్యం కాదని ప్రాక్టికల్ ఫిలాసఫీ ధ్యేయంగా శ్రీ శ్రీ శ్రీ గురువిశ్వ స్ఫూర్తి వారు మనిషి యొక్క మార్పు మనసు మార్పు ద్వారానే సాధ్యమవుతుందని అందుకు కావాల్సిన ఆసనాలు ప్రాణాయామం ధ్యానం విధానాన్ని మానవాళికి అందించారని తెలియజేశారు. ఈ సభలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి మేక రజినీకాంత్ మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారు ప్రాక్టికల్ ఫిలాసఫీతో వారు బోధిస్తున్న వాటిని ఆచరించి చూపిస్తూ మానవాళికి దిక్సూచిగా నిలుస్తున్నారని ఆయన తెలియజేశారు. మరో విశిష్ట అతిథి ఆంధ్ర భాషా ఉపన్యాసకులు పైడిపాటి ఉమా నాథ శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అనాదిగా వేదాలు ఉపనిషత్తులు మంచిని బోధిస్తున్న గానీ మనసు మార్పుని పొందాలంటే కావలసిన ఆచరణాత్మక విధానాన్ని ఆచరణాత్మక విధానాన్ని వివరించారు.