తెలుగు తేజం , అమరావతి: షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్లు, ఆర్ఐవో, డీఈవోలతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ఏ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని.. పరీక్షలు అనివార్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. ఇంటర్ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.