Breaking News

సంక్షేమ పథకాల జల్లులతో రాష్ట్రం పులకరిస్తుంది:దేవినేని అవినాష్

తెలుగు తేజం, విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు అమలు చేస్తున్న పధకాల జడివానలో రాష్ట్రం పులకరించిపోతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు గత 10 రోజుల నుండి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ లో చేపట్టిన ప్రజలలో నాడు…ప్రజల కోసం నేడు కార్యక్రమం ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక 5 వ డివిజన్ క్రీస్తురాజపురం నుండి 7 వ డివిజన్ శిఖమణి సెంటర్ వరకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టి ముందుగా వైస్సార్ ,అంబేద్కర్ మరియు దేవినేని నెహ్రూ గారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి తదనంతరం కాలినడకన ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజా స్పందనను,మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో అవినాష్ తో పాటు భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముఖ్యమంత్రి గారి జనారాజంక పరిపాలన కు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ప్రతి డివిజన్ లో ప్రజలు ఎంతగానో ఆదరించారు.జగన్ ఇచ్చిన మ్యానిఫెస్టో ప్రకారం హామీలను అమలు చేస్తున్నారు.నవరత్నాలు ని అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు.డ్వాక్రా రుణ మాఫీ,అమ్మ వడి,జగనన్న చేయూత, ఫించన్లు పంపిణీ లాంటి మరెన్నో పథకాలు మరెక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్నాయి.గత టీడీపీ ప్రభుత్వం లో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది,,5 సంవత్సరాలు కాలయాపన చేసి షోయింగ్ రాజకీయాలు చేశారు.ప్రజలు టీడీపీ నేతల పనితనం గమనించే సరైన రీతిలో గుణపాఠం చెప్పారు.మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండటం ఖాయం.జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వలన వైసీపీ నేతలు దైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారు.తూర్పు నియోజకవర్గ న్నీ వైసీపీ కి కంచుకోటలాగా మారుస్తున్నాం అని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్ లలో కార్పొరేటర్ అభ్యర్థులు అందరూ కూడా చురుగ్గా పని చేస్తూ నిత్యం ప్రజలకు అండగా ఉంటున్నారు అని,రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద వైసీపీ జెండా ఎగరవేస్తాం అని ఘంటాపథంగా చెప్పారు.
ఇది ఆరంభం మాత్రమే రాబోయే ఎన్నికల్లో జగన్ సత్తా ఏమిటో చూపిస్తాం అని అవినాష్ అన్నారు.గత 10 రోజుల నుండి కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్ అభ్యర్థులు కలపాల అంబేద్కర్, మేరకనపల్లి మాధురి,లామ్ కిరణ్,సుజాత,వేగే వెంకటేశ్వరరావు,సంపత్, ఒగ్గు విఠల్, కుటుంబరావు, సొంగా రాజ్ కమల్,చిత్రం లోకేష్, అన్ని డివిజన్ ల కార్పొరేటర్ అభ్యర్థులు, మాజీ డిప్యూటీ మేయర్ లు,తాజా మాజీ కార్పొరేటర్ లు,బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు,డైరెక్టర్ లు,పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *