నూజివీడు : సమాజ అభివృద్ధి కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు కుమార్ విద్యాసంస్థల అధినేత పివి కుమార్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం సేవలు అందించిన 30 మంది ఉపాధ్యాయులకు గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో పోటీ ప్రపంచానికి ధీటుగా నిలబడి విజయం సాధించాలన్నా, మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలన్నా ప్రైవేటు విద్యాసంస్థలు ఎంతో అవసరమన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ విద్యా సంస్థలు నేడు పోటీ పడవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తి, విద్య పట్ల ఆసక్తి పెంపొందించడంతోపాటు ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. కరోనా మహమ్మారి వంటి విపత్తులు ఎదురైన ప్రైవేటు ఉపాధ్యాయులు తమ కృషిని, బాధ్యతను వీడలేదన్నారు. నేడు ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ప్రధానమైన భూమిక ప్రైవేట్ విద్యాసంస్థలు పోషిస్తున్నాయని నిజం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.