హైదరాబాద్: జాన్ సీనా తన రెజ్లింగ్ ట్యాలెంట్‌ను హైదరాబాదీలకు చూపించాడు. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ సీనా అటాకింగ్ గేమ్‌కు నగర ప్రజలు ఫిదా అయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రత్యేకత సంతరించుకున్న జాన్ సీనా బౌట్‌ను చూసేందుకు హైదరాబాదీలు ఎగబడ్డారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియం సీనా నామంతో మారిమోగిపోయింది. సీత్ రోలిన్స్ కలిసి బరిలోకి దిగాడు. బౌట్‌లోకి రావడం ఆలస్యం.. ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. లుడ్విగ్ కైసర్, గియోనీ విన్సి జోడీని మట్టికరిపిస్తూ ట్యాగ్ టీమ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. తొలుత ట్యాగ్టీమ్గా భావించినా..ఆ తర్వాత అనుహ్యంగా డ్రూ మెక్లెంట్రీ, జిందర్ మహల్ ఎంట్రీతో పోటీ ఇంకా రసవత్తరంగా మారింది. దీనికి తోడు మ్యాట్ రిడిల్స్ కూడా రింగ్‌లోకి రావడం కొత్త డ్రామాకు తెరతీసింది.