Breaking News

చంద్రబాబును విడుదల చేయాలి,అవినీతిపై విచారణ జరపాలి : సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్

కడప : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రాబాబునాయుడు శుక్రవారం తెల్లవారుజామున 3:15 నిమిషాలకు అర్ధాంతరంగా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కోర్టు అరెస్టు వారెంట్ లేకుండా నంద్యాలలో ఆయన వసతిపై దాడిచేసి, జనాన్ని భయబ్రాంతులకు గురిచేసి అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యనని వారన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత జిల్లాల పర్యటనలో భాగంగా నంద్యాలలో ఉన్నప్పుడు అరెస్టు చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం. ఈ అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), సి.పి.ఎం. కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదనీ, సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ తెలియజేశారు. చంద్రబాబును తక్షణమే విడిచిపెట్టి స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా విచారణ జరపాలని సి.పి.యం. కోరుతున్నది.చందబ్రాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఆయన కుమారుడు లోకేష్‌ను అనుమతించకపోవడం అప్రజాస్వామికం. ఈ అరెస్టులను సి.పి.యం. కడప జిల్లా కమిటీ ఖండిస్తున్నదని. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *