Breaking News

రాజకీయాల్లో ఉండేందుకు జగన్ అనర్హుడు

విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ భరత్
అమెరికాలోని కాలిఫోర్నియాలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బ్లాక్ డే పాటించిన ఎన్నారై టిడిపి శ్రేణులు
అమెరికా: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి న నేపథ్యంలో ఈరోజు రాత్రి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మెలిపట్టస్ పట్నంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారై టిడిపి కో-ఆర్డినేటర్ ,తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి ఎన్నారై టిడిపి శ్రేణులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశాఖ పార్లమెంటు టిడిపి ఇన్చార్జ్, గీతం యూనివర్సిటీ చైర్మన్ శ్రీ భరత్ ముతుకుమిల్లి మాట్లాడుతూ… రాజకీయాల్లో ఉండేందుకు జగన్ అనర్హుడు అని రాష్ట్ర ప్రజలు జగన్ వైఖరిని గమనిస్తున్నారని ప్రతిపక్షాలను జగన్ అనగదొక్కాలని చూస్తున్నారని, ఎన్.ఎస్.జి భద్రత ఉన్న వ్యక్తిపై ప్రవర్తించే తీరు ఇదేనా? రాజకీయ వ్యవస్థలో అందరూ ఈ పరిణామాన్ని ఖండించాలని చంద్రబాబు అరెస్టుపై పైశాచిక ఆనందం పొందడం తప్ప వైసీపీ నేతలు సాధించేది ఏమి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ…. వ్యక్తిగత కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని, కేంద్రం వెంటిలేటర్ తీసేస్తే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రాణం పోతుందని, కేంద్రం దయా దాక్షిన్యాలపై జగన్ పాలన సాగుతుందని, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా జగన్ కేంద్రం కాళ్ళ మీద పడ్డారని ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యాక్షనిస్టుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని చంద్రబాబుపై వివిధ సెక్షన్లలో కేసులు పెట్టడం దారుణం అని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా కనీసం పోలీసులు చెప్పకపోవడం జగన్ నిరంకుశ పరిపాలనకు నిదర్శనం అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంకట్ కోగంటి, విజయ్ గుమ్మడి, భక్త చల్లా ,సురేష్ పోతినేని, భాస్కర్ వల్లభనేని,గోకుల్ రాజు, భరత్ ముప్పిరాల, హర్ష ఎడ్లపాటి, వీరు ఉప్పల, శ్రీకర్ రెడ్డి, వెంకట్ అడుసుమిల్లి,చంద్ర గుంటుపల్లి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *