దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంద ఆయుష్ పారామెడికల్ సిబ్బంది జీవితాలు గత ప్రభుత్వాలు చేసిన పాపాలకు తమ జీవితాలే నిలువెత్తు సాక్ష్యాలు మేమే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి సిద్ధం అంటున్నారు ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులు ఆనాటి ప్రతిపక్షనేత గా పారామెడికల్ ఉద్యోగులకు కు న్యాయం న్యాయం చేస్తానని మాట ఇచ్చారు . నేటి ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి పారామెడికల్ సిబ్బంది ని. ఉద్యోగాల్లో నియమించాలని ఆదేశించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్నారు ఆయుష్ ఉద్యోగులు
తెలుగు తేజం, కడప : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2008 లో డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో(PHC) ఏర్పాటుచేసిన ఆయుష్ డిస్పెన్సరీ లలో కాంట్రాక్ట్ ఆయుష్ వైద్యులు మరియు కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది ఆయుష్ డిస్పెన్సరీ లలో నియమించడం జరిగింది ఈ 13 సంవత్సరాలుగా పదసంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు భారతీయ సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేద హోమియోపతి యునాని యోగా ఆయుష్ వైద్యాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో ఆయుష్ పారామెడికల్ సిబ్బంది పాత్ర మరువలేనిది ఇది కానీ 2011 సంవత్సరంలో ఈ ఆయుష్ డిస్పెన్సరీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులను వెయిటేజీ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లుగా నియామకం చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఆయుష్ వైద్యుల ను రెగ్యులర్ వలన వలన 587 డిస్పెన్సరీ లో గాను 457 డిస్పెన్సరీ లో ఆయుష్ వైద్యులు పోస్టులు ఖాళీ అయినవి. ఆనాటినుండి ఖాళీగా ఉన్న 457 డిస్పెన్సరీ లో ఆయుష్ వైద్యుల పోస్టులు భర్తీ కొరకు ఆయుష్ కమిషనర్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ అనుమతి అనుమతి కోరుతున్నా ఫలితం మాత్రం శూన్యం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2017 లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న 457 ఆయుష్ డిస్పెన్సరీ ఆంధ్ర ప్రదేశ్ లో మూతపడిన దుస్థితి దీని వలన గత పది సంవత్సరాలుగా ఈ ఆయుష్ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని 2017 ఏప్రిల్ లో జీతాలు కూడా చెల్లించకుండా కనికరం లేకుండా ఉద్యోగాల నుండి తొలగించారు. తమ ఉద్యోగాల కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆనాటినుండి ఆయుష్ పారామెడికల్ సిబ్బంది పోరాడుతూనే ఉన్నారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఆనాటి ప్రభుత్వానికి ఈ సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం గమనార్హం. అంతేకాదు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర లో కూడా డా ఈ ఆయుష్ పారామెడికల్ సిబ్బంది ఆయన కలిసి తమ గోడును వివరించారు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఒక నెలలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని మరువని సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని ఆదేశించడం జరిగింది కానీ అధికారుల అలసత్వం నేటికి మాకు ఉద్యోగాలు దక్కలేదు అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ పారామెడికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 457 ఆయుష్ వైద్యశాలలో కాంట్రాక్ట్ ఆయుష్ వైద్యులను నియమించడం ద్వారా 800 మంది ఆయుష్ పారామెడికల్ ఉద్యోగాలు లభిస్తాయి. కానీదీనికి సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖలో నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంచడం విశేషం. ఇప్పటికైనా ఆర్థిక శాఖ అధికారులు స్పందించి తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకొని తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ పారామెడికల్ సిబ్బంది కోరుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా పట్ల సానుకూలధోరణిలో ఉన్నపటికీ ఆర్ధిక శాఖా అధికారులు కాలయాపన చేస్తున్నారని డిస్కషన్ ల పేరు చెప్పి నెలలు తరబడి తమపట్ల నిర్లక్ష్య ధోరణిలో వ్యవహ రిస్తున్నారని ఆయుష్ పారామెడికల్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీసీ వెంకట సుబ్బయ్య అన్నారు. మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రంలో 2017 నుండి పారామెడికల్ సిబ్బంది ఉదోగాలు లేక 10 మంది మృత్యువాత పడ్డారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర లో ఇచ్చిన హామీని అమలు చేసి తమకు నాయ్యం చేయాలని ఆయుష్ పారా మెడికల్ స్టేట్ జనరల్ సెక్రటరీ పి సురేష్ గుప్తా అన్నారు.