700 ఆధార్ కార్డులు ట్యాపరింగ్
నిందితుల్ని అదుపులో తీసుకున్న పోలీసులు
తెలుగు తేజం, గుడివాడ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిద రకాల పథకాలకు వయోపరిమితి విధిచడంతో ఆధార్ కార్డు లో వయసును మార్పు చేస్తున్నారు. గుడివాడ ప్రాంతంలో సుమారు 700 మంది ఆధార్ కార్డు లో వయస్సు మార్చారని సమాచారం. 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పధకం ద్వారా రూ. 18,750 చొప్పున 4 సంవత్సరాల పాటు ఇస్తుంది. ఇందులో మొదటి విడత లబ్ది దారుల బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఒక జాతీయ బ్యాంకు లో సాంకేతిక విషయాలు తెలిసిన పొరుగు సేవల ఉద్యోగి కార్వే సంస్థలో పని చేసిన ఒకరు ఆధార్ కార్డుల్లో వయసు పెంచి చేయూత పథకం కింద పొందేలా మార్పు చేస్తున్నాడు. వయసు తక్కువ ఉన్న ఆధార్ కార్డు దారుల పేరిట 45 ఏళ్ళు నిండిన వారి పాన్ కార్డు ను తయారు చేసి దాని ఆధారంగా ఆధార్ కార్డులో వయసు పెంచి చేయూత పధకానికి అరుహులుగా చూపుతున్నారు. ఎవరైనా పాన్ కార్డు తెస్తే క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి ఆధార్ కార్డుదారునికి చెందిన పాన్ కార్డు కాదా అనేది బ్యాంకు ఉద్యోగి, నెట్ సెంటర్ ఉద్యోగి నిర్థారించు కోవాలి. ఆధార్ కార్డు వయసు మార్చినందుకు రూ. మూడు నుండి రూ. ఐదు వేల వరకు తీసుకున్నట్లు సమాచారం డీస్పీ ఎన్. సత్యానందం ఆధ్వరంలో సీఐ వి. దుర్గారావు ఈ కేసుని దర్యాప్తు చేపట్టారు