తెలుగు తేజం, విజయవాడ : ప్రతి అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా రాజకీయం చేయాలని చూస్తోందని బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని మఠాలు, స్వామిజీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. 2016లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై గత టీడీపీ ప్రభుత్వం సర్య్కులర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే లేఖ రాసింది. మఠాలు, స్వామిజీల అంశాలను కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరిస్తోంది.
మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం మాది. గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు. మేం చేస్తే తప్పు ఎలా అవుతుంది?. బూట్లు వేసుకుని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలది. యనమల రామకృష్ణుడు దిగజారి మాట్లుడుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారా లేదా? అప్పట్లో శారదా పీఠం వెళ్లి సుజనా చౌదరి, మురళీ మోహన్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోలేదా?. చంద్రబాబు డైరెక్షన్లో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతున్నారు.
స్వామీజీలకు పార్టీలతో సంబంధం ఉండదు. వారికి రాజకీయాలు అంటగట్టడం సమంజం కాదు. వరుస ఓటములతో యనమలకు బుద్ధి మందగించింది. యనమల రామకృష్ణుడు ప్రెస్ నోట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణా లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాలు శారదా పీఠంకు రాసిచ్చింది. మేం అలా రాసి ఇవ్వలేదు. మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. హిందూ ధర్మాన్ని శారదా పీఠం అధినేత స్వరూపానంద సరస్వతి కాపాడుతున్నారు. స్వామీజీలు ఆయా రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం వారి ఇష్టం.’ అని అన్నారు.