హెల్మెట్ తప్పనిసరి నిబంధన అమలు దృష్ట్యా వారం పాటు జాతీయ రహదారి పై అవగాహన కార్యక్రమాలు
తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండండి క్షేమంగా ఇంటికి చేరుకోండి అంటూ కొద్దిరోజులుగా కంచికచర్ల పోలీసులు చేసే హెచ్చరికలు వాహనదారులకు తెలిసిందే. వాహనాదారులకు మరింత అవగాహన కలిగించడానికి ప్రతి సందర్భాన్ని పోలీసులు చక్కగా వినియోగించుకుంటున్నారు.రోడ్డు ప్రమాదాలపై కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల ప్రజలలో అవేర్నస్ కల్పించేయత్నం చేసారు.మరీ ముఖ్యంగా టూవీలర్ పై హెల్మెట్ లేకుండా వెళుతున్న వారిని ఆపి మరీ చైతన్య పరిచారు.అలాగే పెండింగ్ చలానా జాబాతాను స్మార్ట్ ఫోన్ ద్వారానే వాహనదారుల ఎదుటే చూపించి చలానాలు తప్పనిసరిగా కట్టాలని సూచించారు. నందిగామ రూరల్ సీఐ సతీష్ మాట్లాడుతూ బండి నడిపేటప్పుడు రోడ్డు పైనే ధ్యాస పెట్టాలి. డ్రైవింగ్ చేయడం ఒక బాధ్యత. ఇతర బయటి విషయాలపై దృష్టి పెడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ట్రాఫిక్ నియమాలు పాటించండి. క్షేమంగా ఉండండి అంటూ హెల్మెట్, సీటు బెల్ట్ ,ముఖానికి మాస్క్ లేని వారిని హెచ్చరికలు చేసి మరీ అలెర్ట్ చేసారు.త్వరలో హెల్మెట్ తప్పనిసరి నిబంధన కఠినంగా అమలు చేయవలసి ఉంటుందని ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఎస్ఐ ఎం పి ఎస్ ఎస్ రంగనాథ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు