తెలుగు తేజం, కేంద్రం ప్రవేశపెట్టిన లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ నుండి ఏ కార్మికుడిని ఆదుకున్న వారు లేరు దేశవ్యాప్తంగా చూసుకుంటే పని చేసుకునే వాడికి పని లేకుండా పోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ఉంటే వాటిలో ఉన్న డబ్బులు కాజేసి ఆ బోర్డు నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరం ఉంది. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేయకుండా ఉంటే కార్మికులు ఈరోజున రోడ్డెక్కి పరిస్థితి ఉండేది కాదు కార్మిక చట్టా లను మార్చటం కార్మికులు ఉపాధి కోల్పోయే పద్ధతులు అవలంబించడం కరోనా కాలంలో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వకపోవడం ప్రభుత్వ రంగ సంస్థలను *ప్రైవేటుపరంచేయటం ఇటువంటి చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్న తప్పు కాదుకాని కార్మికుల మైన మాకు ఉపాధి చూపించండి మా కుటుంబాలు రోడ్డున పడకుండా చూడమని మా యొక్క కొనుగోలు శక్తి పెరిగే స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు చేస్తే కార్మికులు రోడ్డుఎక్కాల్సిన అవసరం ఏమిటి కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు సన్నద్ధం అవుతుంటే పోలీసులు ఆంక్షలు విధించి ముందస్తుగానే కార్మిక నాయకులు నోటీసులు అందించారు వారి యొక్క అనుమతుల తోనే కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్
చేయటం ఎంతవరకు సమంజసం. సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు నాయకులకు ముందస్తు నోటీసులు అందజేసిన పోలీసులు.
కంచికచర్లలో నోటీసులు అందుకున్న నాయకులు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి హరికృష్ణ రెడ్డి కంచికచర్ల మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖాసిం కాశి బోయిన రాంబాబు కంచికచర్లమండలం సిఐటియు అధ్యక్షులు బెజ్జం భూషణం తదితరులకు నోటిసులు అందజేసిన పోలీసులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం ఉపయోగించుకుని కార్మికుల పై ఉక్కుపాదం మోపటం సరైనది కాదని ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్మికుల ఆగ్రహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురికాక తప్పదని కార్మిక సంఘం నాయకులు కార్మికులు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నారు