తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ అమోదించబడిన రోజు నవంబర్ 26 సందర్భంగా డాక్టర్ బి.అర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్ ఘనంగా నివాళులు అర్పించ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్ మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ చీకటి సామ్రాజ్యం నుంచి స్వాతంత్యం 1947 ఆగస్టు 15 తేదీన వచ్చిన తర్వాత మనకంటూ పాలన పరంగా ఒక్క నియమనిబంధనలు ఆవసరం అని మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో పలువురు విద్యావేత్తలు,న్యాయ నిపుణులు,వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయడం జరిగింది,ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే అంత సులువు కాదు,అయినప్పటికీ అంబేద్కర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రాఫ్ట్ కమిటీ దాదాపు రెండెళ్ళు పైనే అంకుటిత దీక్ష తో పనిచేసి భారత రాజ్యాంగాన్ని రూపొంచారు అని,ఆ తర్వాత 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలోకి వచ్చిందని, అయితే 2015 వరకు రాజ్యాంగం అమలు లోకి వచ్చిన జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుకుంటున్నమే తప్పా రాజ్యాంగం అమోదించబడిన ఈరోజు అధికారికంగా జరుపుకోవడం లేదని మొదటి సారి భారత ప్రభుత్వం 2015 నవంబర్ 26 రాజ్యాంగ అమోదించబడిన దినోత్సవం గా అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది అని,ఈరోజు మనం అనుభవిస్తున్న సామాజిక, ఆర్థిక,రాజకీయ,స్వచ్ఛ, రిజర్వేషన్లు, పరిపాలన వంటి అంశాలు దేశ పౌరులందరికి సమానంగా అందుతున్నాయి అంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని ఇంతటి గొప్ప రాజ్యాంగ స్పూర్తి ని మనకు అందించిన అంబేద్కర్ లాంటి మేధావికి మనం నివాళులు అర్పించడం భారతీయులందరి భాద్యత అని, దేశంలో మనం జరుపుకుంటున్న రాజ్యాంగ అమోదించబడిన దినోత్సవం అని ఇటువంటి రోజు ఆ త్యాగధనులందరికి నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.
ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్స్ వెల్లంకి రామారావు ఇల్లా సుబ్బారావు పారిశుద్ధ్య కార్మికుల జిల్లా అధ్యక్షుడు బెజ్జం భూషణం కోట ఆనంద్ బిల్లు కలెక్టర్ గుప్తా, రాజేష్, సచివాలయం డిజిటల్ ఇంజనీర్ అమీర్ బాషా, మహిళా పోలీస్ విజయకుమారి డిజిటల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, సచివాలయం విఆర్ఓ బ్రహ్మం, రవి తదితరులు పాల్గొన్నారు.