తెలుగు తేజం, జగ్గయ్యపేట : రాష్ట్రంలో తొలిసారిగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం లోని తక్కెళ్ళపాడు గ్రామంలో డిసెంబర్ 21వ తేదీన వైయస్సార్ జగన్ అన్న శాశ్వత హక్కు , భూ రక్షణ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. సోమవారం ఆయన జగ్గయ్యపేటలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా భూములు సర్వే లో భాగంగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం లోని తక్కెళ్ళపాడు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు ఎంపికచేసి భూ రికార్డులను ల్యాండ్ ప్యూరిఫికేషన్ చేసి వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ఎటువంటి భూ వివాదాలకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రెవెన్యూ సంస్కరణలు అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో వెబ్ ల్యాండ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని దీని ద్వారా రైతుల భూముల రికార్డులను పక్కాగా ఉంటాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో భూమి రైతు యాజమాన్య హక్కు చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకురావడం జరిగిందన్నారు. తద్వారా రైతుల భూమికి పూర్తి భద్రత కలుగుతుందని చెప్పారు. రూ. 927 కోట్లతో భూములు రీ సర్వే ప్రాజెక్టుకు మంత్రి వర్గం ఆమోదించడం జరిగిందన్నారు.