అమరావతి: ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో స్థానిక పరిస్థితులపై గవర్నర్ ఆరా తీశారు. వైద్య, ఆరోగ్యశాఖ మరింత వేగవంత చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సమస్యకు కారణం ఏమిటన్న దానిపై నిపుణుల సలహాలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు.