తెలుగు తేజం, గుడివాడ : బియ్యం కార్డులు పొందేందుకు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులని రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం దగ్గర మంత్రి కొడాలి నాని ని గుడివాడ కు చెందిన తిరుమల్ రెడ్డి శ్రీనివాసరావు కలిసి ప్రస్తుతం తనకు ఎల్ఐసీ ఏజెం ట్‌గా వచ్చే కమీషన్‌కు ముందుగానే టీడీఎస్ కట్ చేస్తారని, దీంతో తన కార్డు తీసివేశారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి మంత్రి కొడాలి నాని స్పందిస్తూ ఆదాయపు పన్ను చెల్లించే అంత ఆదాయం లేకపోతే ఐటీ అధి కారులను కలసి సర్టిఫికెట్ తీసుకుని రావచ్చని తెలిపారు. అనంతరం నాని మాట్లాడుతూ డిసెంబర్ నెల రేషన్ కోటా కింద బియ్యం కార్డులు మాత్రమే నిత్యావసర సరుకులు ఇస్తున్నామన్నారు గత నెల వరకు నిత్యావసర సరుకులు తీసుకుని ఈసారి ఆగిపోయిన కార్డు లో ఎవరైనా అర్హులుంటే ఆ కార్డును పునరుద్ధ రించుకొవచ్చన్నారు. సంబంధిత గ్రామ వార్డు సచివాలయం పూర్తి వివరాలు అప్లోడ్ చేయించుకుని నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రూ . 10 వేలు, పట్టణప్రాంతాల్లో 12 వేలుకు పైగా ఆదాయం కలిగిఉండి పన్ను చెల్లించే వారికి, నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేయడం, 300 యూనిట్లు పైగా విద్యుత్ వాడకం, పట్టణంలో 1000 చదరపు అడుగులు కన్నా ఎక్కువ స్థలంలో ఇల్లు ఉండడం, మూడెకరాల కన్నా ఎక్కువ మాగాణి , పదెకరాల కన్నా ఎక్కువ మెట్టభూమి కలిగిఉండడం తదితర కారణాల వల్ల బియ్యం కార్డులను తీసి వేయడం జరుగుతుందన్నారు అటువంటి కార్డులను పునరుద్ధరించే అవకాశం లేదన్నారు. ఆదాయపు పన్ను చెల్లించే వారు తమకు అంత ఆదాయం లేదని బియ్యం కార్డులు పునరుద్ధరించాలని కోరుతున్నారని కొనసాగించే పరిస్థితి ఉండదన్నారు పన్ను చెల్లింపు దారులు ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలసి వారికి వాస్తవంగా పన్ను చెలించేంత ఆదాయం లేకపోతే ఆవిషయాన్ని తెలియ జేయవచ్చని మంత్రి కోడాలి నాని సూచించారు.