తెలుగుతేజం, జగ్గయ్యపేట : భారత్ బంద్ సందర్భంగా గరికపాడు చెక్పోస్ట్ బోర్డర్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బంధు సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలలో భోజనం సదుపాయాం లేక ఆ రహదారి పై డ్రైవర్లు ఆకలి బాధతో ఎక్కడైనా ఒక పూట భోజనం దొరుకుతుందేమోనని అనేక చోట్ల ప్రయత్నించిన, ఎక్కడ ఫలితం లేకపోవడంతో నిరాశ్రయులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న టువంటి చిల్లకల్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు ఆకలితో అల్లాడి పోతున్న డ్రైవర్ ల పరిస్థితి చూసి ఆయన మనసు చలించి అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని భావించిన ఆయన వారి ఆకలి బాధను తీర్చాలని, సదుద్దేశంతో ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు స్పందించి వెంటనే స్వయంగా 200 మంది వాహన డ్రైవర్లకు ఆహార పదార్థాలు తయారు చేయించి జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో తమ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు మానవత్వంతో ఆకలి బాధ తీర్చిన ఎస్ఐ వాసా. వెంకటేశ్వరరావుకు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోలీసుల లో మంచితనం మానవత్వం కలిగినటువంటి వారు ఉంటారని, నిరూపించుకున్నారని వారు అన్నారు.