తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ రూరల్ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. నందిగామ రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల ఎస్ ఐ లు రంగనాథ్, హరి ప్రసాద్, మణికుమార్ వారి సిబ్బందితో కలిసి బ్యాంకు సిబ్బంది మరియు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన మహిళలకు, ఒంటరి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని దొంగలు వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొని వెళ్ళటం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బ్యాంకు లలో లావాదేవీల నిమిత్తం వచ్చిన మహిళలను మరియు వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలను మరియు ఒంటరి ఉన్న మహిళను టార్గెట్ చేసుకొని దుండగులు హెల్మెట్, మాస్క్, జార్కిన్, మంకీ క్యాప్ పెట్టుకొని ద్విచక్రవాహనంపై రవాణా చేసే వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఆభరణాలు కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు అడ్రస్ కానీ, ఇతర వివరాలు అడిగినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని, అట్టివారు మీ మెడలో గొలుసులను లాక్కొని వెళ్లే అవకాశం ఉంది కాబట్టి, ఒంటరిగా కాకుండా జనాలలో ఉండే విధంగా చూసుకోవాలని, అలాగే పొలాలలో పనిచేసే మహిళలు బంగారు ఆభరణాలు ధరించి పొలాల్లో పనికి వెళ్లవద్దని, అపరిచితులు తారసపడిన ఎడల మీ దగ్గరలోని పోలీసువారికి సమాచారం అందజేసి పోలీసు వారికి సహకరించాలని తెలిపారు.