తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని పద్మావతి నగర్ లో గల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కృష్ణానది జలాలతో జగ్గయ్యపేట పట్టణానికి రూ. 18.90 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ది,పట్టణ గృహాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. అనంతరం జగ్గయ్యపేట పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద ఆసియా మౌలిక సదుపాయాల అభివృధ్ధి బ్యాంక్ (AIIB) రూ. 33.99 కోట్ల నిధులతో సమగ్ర మంచినీటి సరఫరా అభివృధ్ధి పథకానికి ఆయన శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూజివీడు శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు, నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ , యువ నాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.