తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహ్మద్ పేట హైవే పై మెాటర్ వేహికల్ ఇన్స్ పెక్టర్ ఎండియల్ సిద్దిక్ వాహనాలను తనిఖీలు చేసారు.కృష్ణాజిల్లా రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ వరకు వాహనాల తనిఖీలు చేయడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిద్దిక్ తెలియజేశారు.గత రెండు రోజుల నుంచి ఇప్పటికే రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ప్రాంతంలో నిభందనలు పాటించని ముప్పై వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు.ఈ వాహనాల తనిఖీలో వాహనదారులు నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,సరైన రోడ్డు భద్రతల నిబంధనలు పాటించక పోవడం మూలానా వాహనదారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.దీని వల్ల ప్రమాదాలు జరుతున్నాయని,రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద టాక్సీ ప్లేట్ వాహనదారులు సరిహద్దు అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారని,అదేవిధంగా ఓన్ ప్లేట్ కారు ఓనర్ లు టాక్సీలుగా కిరాయిలు తిప్పు తున్నారని,ఇప్పటికే కరోనా నిబంధనలను పాటించడంలేదని,వాహనాల అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు.వీటిని దృష్టిలో పెట్టుకొని ఈనెల 20 వ తేది వరకు జరిగే తనిఖీల్లో రోడ్డు భద్రత పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గయ్యపేట మోటార్ వెహికల్ సిద్దిక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యలయ సిబ్బంది పాల్గొన్నారు.