Breaking News

కన్నుల పండుగగా కోటి దీపోత్సవం

తెలుగు తేజం, నందిగామ : నందిగామ గణపతి ఉత్సవ కమిటీ, వాసవీ మార్కెట్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ -౧౯ నిబందనలు పాటిస్తూ మూడు వందల జంటలు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేసారు. గౌరిపెద్ది రామకృష్ణ శేష సాయి (శేషు) బృందం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన నిర్వహకులు యేచూరి రాము, జెడ్డు పెద్ది రాజు, పారేపల్లి సాయిబాబు, సముద్రాల పూర్ణ, పారేపల్లి చిన్నారి, వనమా బుల్లెబ్బాయి, రాచూరి సీతారామ్, యేచూరి పాండురంగ విఠల్ , కట్టమూడి శ్రీనివాసరావు తదితరులు ఏర్పాట్లు గావించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *