తెలుగు తేజం, మైలవరం : అధికారులు స్థానిక నాయకులు లబ్ధిదారుల సమక్షంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పక్కా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ,పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేగా మంత్రి గా అవకాశం ఉన్నప్పటికి పేదలకు జవాబు పత్రం ఇంటి పట్టా అంటూ కాలయాపన చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ చేస్తున్న అసత్య పనికిమాలిన అరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు హితవు పలికారు. మైలవరం ప్రజలనే కాకుండా చివరకు పాత్రికేయిలను సైతం తప్పుదోవ పట్టించిన ఘనమైన చరిత్ర కలిగిన దేవినేని ఉమాది. నీవు నిరంతరం చేస్తున్న అసత్య ఆరోపణల పై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.పేదల కష్టాలను తెలుసుకున్న నాయకులు జగన్ పాలనలో శాసనసభ్యునిగా పనిచేయడం ఇంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నా అదృష్టమని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పురగుట్ట లో మైలవరం, పోందుగుల, వెల్వడం, తోలుకోడు, కీర్తిరాయిని గూడెం గ్రామాలకు చెందిన 2413 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, వారిలో సగం మందికి పక్కా ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసరా జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్ ,హౌసింగ్ డీఈ నాగమల్లేశ్వరరావు , తహసీల్దార్ రోహిణీ దేవి, పలు శాఖల అధికారులు, స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.