తెలుగు తేజం ,కొండపల్లి : వివాదంలో ఉన్న వక్ఫ్ ఆస్తిస్థలంలో నిర్మాణం పనులు నిలిపి వేయాలని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కొండపల్లి మెయిన్ బజారులోని సర్వే నెంబరు 293 భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదిగా పేర్కొంటున్నారు.పీరుల పంజాకు చెందినదిగా గ్రామ ముస్లిం పెద్దలు చెబుతున్నారు.ఆ భూమిలో కరణం సుధీర్ అనే వ్యక్తి రాత్రిపూట జేసీబీతో గొయ్యితీసి భవన నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు.స్థలం విషయం గ్రామానికి చెందిన కొందరు వక్ఫ్ స్థలంగా పేర్కొనడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. సమాచారాన్ని ఎమ్మెల్యే వసంత దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన కొండపల్లిలోని వివాదాస్పద స్థలం వద్దకు చేరుకొని విచారించారు.వక్ఫ్ బోర్డు అధికారులు, స్థల యజమాని తమ రికార్డులుతో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఎదుట హాజరు కావాలని సూచించారు.రికార్డులను పరిశీలించి, ఎవరిదనే విషయం రెవెన్యూశాఖ నిర్ధారించిన తరువాతనే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అప్పటి వరకు మున్సిపల్ అధికారులు నిర్మాణానికి ఇచ్చిన అనుమతి వెనక్కు తీసుకొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సి.ఐ శ్రీధర్ కుమార్,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.