తెలుగు తేజం, విజయవాడ : నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సహకార రంగానికి జవ సత్యలు ఇస్తే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకు సహకార రంగానికి బలోపేతం చేయడానికి అకుంఠిత దీక్ష తో పనిచేస్తున్నారని వైస్సార్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కె మోహన్ రాజు వేదిక ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొని, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఏ సమస్యలు లేకుండా పనిచేసే వాతావరణం కల్పించినప్పుడే బ్యాంకులు అభివృద్ధి చెందుతుందని బ్యాంకుల నుండి రైతాంగానికి అధికంగా రుణ వితరణ చేసి ఇతర బ్యాంకులుకు ధీటుగా పనిచేయాలని అప్పుడే సహకార రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు . అనంతరం ప్రధాన కార్యదర్శి బిహెచ్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ సహకార బ్యాంకు ఉద్యోగులకు ఐబిఎ స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు టి. వెంకట సుబ్బా రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ టి యు సి అనుబంధ సంఘముగా ఎపిసిబిఈఎ రాష్ట్రంలో అతిపెద్ద డిసిసిబిల ఉద్యోగ సంఘముగా బలపడింది. ఉద్యోగ సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కన్వీనర్ కె. బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ డిసిసిబిలలో చీఫ్ మేనేజర్ పోస్టులను ప్రవేశపెట్టాలని అమలోతృవనాథన్ కమిటీ సిఫారసులు అమలు పరచాలని డిమాండ్ చేశారు. కార్యనిర్వాహణ అధ్యక్షులు సి. త్రినాద్ రెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో వైజాగ్ డిసీసీబి ,సీఈఓ డివియస్ వర్మ, ప్రకాశం డిసీసీబి చైర్మన్ మాదాసి పెద వెంకయ్య ,జిల్లా బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు , అన్ని జిల్లాల ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.