తెలుగు తేజం, నందిగామ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా నందిగామ పట్టణ పరిధిలోని 20 వార్డులకు వైయస్ఆర్ -జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి నందిగామ చేరుకున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,హోం శాఖ మాత్యులు సుచరిత ,వెల్లంపల్లి శ్రీనివాస్ ,ఎంపీ బాలశౌరి ,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ,ప్రభుత్వ విప్ ,జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ,పార్టీ నాయకులు దేవినేని అవినాష్ లకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మేళతాళాలు ,మంగళ వాయిద్యాలు ,పూర్ణకుంభ మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. నందిగామ గాంధీ సెంటర్ లోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ,ఇళ్ల పట్టాల పంపిణీకి చిహ్నంగా ఏర్పాటుచేసిన పైలాన్ ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకొని ప్రసంగించారు , వైయస్సార్ -జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో భాగంగా ప్రభుత్వం నుండి మంజూరైన పట్టాలను ,గృహ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ,
అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మంత్రులను ,ఎమ్మెల్యేలను ,గౌరవ అతిధులను ఘనంగా సత్కరించారు ,
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ,చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ,మున్సిపల్ -రెవెన్యూ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…