తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో యువతి యువకులకు సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అను స్వచ్చంధ సంస్థ వారు టాటా ట్రస్ట్ సహకారం తో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాని సచివాలయం సెక్రటరీ మల్లయ్య మరియు సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ పాజెక్ట్ ఆఫీసర్ అల్లాబక్షు షేక్ చేతుల మీద ప్రారంభించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం సమన్వయకర్త యం. రాజేశ్వరరావు మాడ్లాడుతూ గత 4 సంవత్సరాలనుండి ఈ ప్రాంతంలో అనేక మంది యువతి యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి జీవనోపాధి కల్పించడం జరిగిందన్నారు. మల్లయ్య మాట్లాడుతూ సెంటర్ ఫర్ పీపుల్స్ వారు మన గ్రామంలో ఈ శిక్షణ నిర్వహించడం చాలా సంతోషం దాయకమని అదేవిదంగా మన ప్రాంతంలో వివిధ శిక్షణలు నిర్వహించి అనేక మంది జీవనోపాధి కలిపిస్తున్నారని . ఈ అవకాశని అందరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అల్లాబక్షు షేక్ మాట్లాడుతూ మా సంస్థ 2006 నుండి ఫారెస్ట్ ప్రాంతాలలో మరియు రూరల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం సమన్వయ కర్త యం .రాజేశ్వరరావు , ట్రైనర్ వెంకట్ , స్కిల్ మిత్రలు , శారద మరియు 30 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఈ 45 రోజులు ఉంటుంది, 30 మందికి అవకాశం కలదు.