తెలుగు తేజం, గొల్లపూడి : 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం గొల్లపూడి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులు జెండా వందనం చేసి మహనీయుల చిత్ర పటాలకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు రాము మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. ధర్మో రక్షతి రక్షితః ధర్మానికి గౌరవం ఇచ్చామని ఆ ధర్మమే విజయ తీరాలకు బాటలు వేస్తుంది ప్రభుత్వ పని తీరును ఉద్దేశించి ప్రసంగించారు. ఏ ఎంసి చైర్మన్ కారెంపూడి సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల ఆశయాల సాధనకు నేటి తరం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.