తెలుగు తేజం, ముప్పాళ్ల గురుకుల పాఠశాల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్
మంద పిచ్చయ్యమాట్లాడుతూ 1947 ఆగస్టు 15న పరాయి దేశస్తులు నుంచి ఎన్నో పోరాటాల ద్వారా మన దేశానికి స్వతంత్రం తెచ్చుకుని రోజు స్వతంత్రం తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా భారతదేశం లో అతి పెద్ద రాజ్యాంగం ని రాసి 1950 జనవరి 26 వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గా జనవరి 26 వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని కావున విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చదువు ద్వారానే అసమానతలు తొలగిపోతాయని చెప్పిన అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ముప్పాళ్ల గురుకుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం లో భాగంగా 24 లక్షల రూపాయలతో స్కూల్ అభివృద్ధి చేపట్టడం జరిగిందని వర్షం కాలం వస్తే రోడ్లు సరిగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి సిసి రోడ్ల నిర్మాణం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీచర్స్ మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.