తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : కేతనకొండ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని వైఎస్ఆర్ సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లకుర్తి నళిని ఆషాలత తెలిపారు.ఆదివారం నాడు వైఎస్ఆర్ సీపీ బలపరిచిన కేతనకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు .వారితో పాటు 14 మంది వార్డు మెంబర్ గా ఒకేసారి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా గ్రామాల్లో భారీ ర్యాలీ గా బయలుదేరి స్థానిక పంచాయతీ ఆఫీస్ వద్దకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.