Breaking News

నామినేషన్లు దాఖలు చేసిన జనసేన మరియు బి.జె.పి కూటమి అభ్యర్థులు

తెలుగు తేజం. కంచికచర్ల : కంచికచర్ల పట్టణంలో జనసేన మరియు బి.జె.పి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా శేషం జ్యోతి రాణి నామినేషన్ దాఖలు చేయగా 1వ వార్డు అభ్యర్థిగా పుట్టా స్వరూప, రెండవ వార్డు అభ్యర్థిగా ఐలపోగు అనిల్ కుమార్, మూడవ వార్డు అభ్యర్థిగా కడియాల నాగమణి, నాల్గవ వార్డు అభ్యర్థిగా జెర్రిపోతుల చంటి బాబు, ఐదవ వార్డు అభ్యర్థిగా షేక్ హిమాంబి, ఆరవ వార్డు అభ్యర్థిగా కేతేపల్లి శిరీష, ఏడవ వార్డు అభ్యర్థిగా గుడిగుంట్ల తిరుమలదేవి, ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, తోమ్మిదవ వార్డు అభ్యర్థిగా తోట ఓంకార్, పదవ వార్డు అభ్యర్థిగా యర్రబోలు రమణ, పదకొండవ వార్డు అభ్యర్థిగా షేక్ అబీదా, పన్నెండవ వార్డు అభ్యర్థిగా బొల్లం లక్ష్మీ తిరుపతమ్మ, పదమూడవ వార్డు అభ్యర్థిగా పెద్దినిడి హరిబాబు, పద్నాలుగవ వార్డు అభ్యర్థిగా కావాటి నాగలక్ష్మి, పదిహేనవ వార్డు అభ్యర్థిగా వనపర్తి పద్మారావు, పదహారవ వార్డు అభ్యర్థిగా కంభంపాటి రమాదేవి, పదిహేడవ వార్డు అభ్యర్థిగా పుప్పాల వేణుగోపాల్, ఇరవై వ వార్డు అభ్యర్థిగా దేవి రెడ్డి అజయ్ బాబు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నామినేషన్ ఈ కార్యక్రమానికి నందిగామ జనసేన పార్టీ ఇన్చార్జి తోట మురళి మరియు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు నన్నపనేని కృష్ణమూర్తి మరియు జనసేన బిజెపి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

జనసేన మరియు బిజెపి కూటమి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు..

మండలంలో బత్తిన పాడు గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా గొర్రెముచ్చు రాజు, చెవిటికల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంగి శెట్టి నాగలక్ష్మి, గండేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొక్కా నవ్య,పేరకలపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పెరుమాళ్ళ సంధ్య నామినేషన్లు దాఖలు చేశారు. పేరకలపాడు గ్రామంలో ఆరవ వార్డు అభ్యర్థిగా ఏసు పోగు పుల్లారావు ,ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా పెరుమాళ్ళ సురేష్, నామినేషన్లు దాఖలు చేశారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *