5 సంవత్సరాలు పైబడి విడిపించుకొని వాహనాలను గరికపాడులో వేలానికి చర్యలు తీసుకుంటాం : ఆర్టీఓ యం పద్మావతి
తెలుగు తేజం, నందిగామ (ప్రదినిది) : రికార్డులు లేకుండా తిరుగుతూ పట్టుబడ్డ వాహనాలను అమ్మకం నిర్వహించుటకు గరికాపాడు ఆర్టీఓ చెక్ పోస్ట్ నందు సిద్ధం చేస్తున్నామని ఆర్టీఓ యం పద్మావతి తెలిపారు. స్థానిక నందిగామ ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్టీఓ యం పద్మావతి మాట్లాడుతూ గరికపాడు ఆర్టీఏ చెక్ పోస్టు నందు రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా తిరుగుతూ పట్టుబడ్డ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్, రోడ్డు రోలర్, హెవీ గూడ్స్ వాహనాలను గతంలో సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. వాహనాలను పరిశీలించగా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్ కు ఛాసిస్ నెంబర్ L120EV21115 గా, రోడ్డు రోలర్ వెహికల్ కు ఛాసిస్-ఇంజిన్ నెంబర్లు 061135/ 020010గా, హెవీ గూడ్స్ వెహికల్ ఛాసిస్ నెంబర్ 380010AQ700918గా వాహనాలపై ఉన్నవని ఆమె తెలిపారు. పలుమార్లు తెలియచేసినప్పటికి వాహనాలను విడుదల కొరకు యజమానులు, ఫైనాన్షియర్స్ సంబంధిత రికార్డులతో హాజరుకాలేదన్నారు. 5 సంవత్సరంలు పైబడి ఆర్టీఏ చెక్ పోస్టు గరికపాడులొనే నిర్బంధంలో ఉన్నాయన్నారు. చివరిగా ఈనెల 26లోపు వాహనాల విడుదలకు సంబంధించిన పత్రాలతో నందిగామ ఆర్టీఓ కార్యాలయము నకు సంబంధించిన యజమానులు హాజరవ్వాలన్నారు. లేనిచో మోటార్ వాహన చట్టంనకు లోబడి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.