తెలుగు తేజం, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో నేడు జరుగుతున్న 12 మున్సిపల్ కార్పొరేషన్స్ మరియు 75 మున్సిపాలిటీలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపిస్తేనే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ మరియు జనచైతన్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. కులం, మతం, వర్గ రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో మద్య నియంత్రణను చేస్తూ మద్య వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు.కరోనా సమయంలోను సైతం ఏ ఒక్కరికి ఇబ్బంది కలగని రీతిలో దాదాపు 80 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు కేటాయించి ప్రతి ఇంటికి అందేటట్లు చేయడంతోపాటు. ఎస్సీ,ఎస్టీ బిసి,మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ కుల పేదలను సైతం సంక్షేమ పథకాలను అందించటానికి చేస్తున్న కృషి వెలకట్ట లేందన్నారు. అంతేకాకుండా వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలతో ప్రజల వద్దకు పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలవగా పురపాలక ఎన్నికలలో 90% పైగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు పొందుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ పాల్గొన్నారు.