తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా. వ్యాపారస్తులు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనిలో భాగంగా విజయవాడ చాంబర్ కార్యాలయంలో అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు అధ్యక్షతన శుక్రవారం అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యలపై కూలంకషంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావడం జరిగిందని దీనిలో భాగంగా ఈ నెల 18 న (ఆదివారం) అన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేయాల్సిందిగా తీర్మానిం చడమైనదన్నారు అలాగే ఈ నెల 19 తేదీ సోమవారం నుండి 30వ తేదీ శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకే షావులు, వ్యాపార నంన్ధలను మూసి వేయాలని నిర్ణయించడమైనదని ఆయన తెలిపారు . ఈ విషయాన్ని గమనించి వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, పూర్తి సహాయ సహకారాలు అందించి కరోనా కట్టడికి సహకరించాల్సిందిగా మనవి చేసారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి వ్యాపారసంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు మాస్కు ధరించాలని, శానిటేషన్ చర్యలు చేపట్టాలని, అందరూ. తప్పక భౌతిక దూరం పాటించి రక్షణ పొందాల్సిందిగా కోరుతున్నాము. వినియోగదారులు కూడా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించే విషయంలో చైతన్య వంతులను, చేయాల్సిందిగా మనవి చేసారు.