కృష్ణాజిల్లా జగయ్యపేట నియోజకవర్గం
పెనుగంచిప్రోలు గ్రామంలో ని
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు దేశంలో ఉన్న ఆర్.ఎన్.ఐ లో రిజిస్టర్ చేసుకున్న పత్రికలకు మరియు శాటిలైట్ ఛానల్ వారికి అక్రిడేషన్ ప్రక్రియ ఇవ్వటం జరుగుతుందని,దీనితో పాటు యూట్యుబ్,పేపర్ లెస్ ద్వారా ఆన్ లైన్ నిర్వహణ వారికి కూడా అక్రిడేషన్ ఇచ్చే దాంట్లో ప్రాధాన్యత కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని కల్లూరి శ్రీవాణి అన్నారు.
కాని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రి అక్రిడేషన్ కొరకు ఆన్ లైన్ ద్వారా పెద్ద,మద్య తరహా,చిన్న సంస్థల పత్రికలలో పని చేస్తున్న నలబై వేలమంది పాత్రికేయులు అక్రిడేషన్ కోసం అప్లయి చేసారని మీడియా సమావేశంలో మాట్లాడరని ఆమె అన్నారు.
కరోనా సమయంలో పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు చాలా అవస్థలు పడుతున్నారని,వీటి మీద ఆధారపడిన సిబ్బంది మరియు డివిజన్,మండల స్థాయి విలేకరులు సైతం ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు అహర్నిశలు కృషి చేస్తున్నారని,దీని మూలానే దేశంలో, రాష్ట్రంలో సైతం కరోనా జాగ్రత్తలు ప్రజలు తీసుకునే అవగాహన పలు ప్రచారం మూలానా మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చని ఆమె అన్నారు.
అటువంటి ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద,మద్యతరహా,చిన్న తరహా సంస్థల వారిని,మరియు పని చేస్తున్న సిబ్బంది మరియు పాత్రికేలను అక్రిడేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టడం సరేనది కాదని,ఆన్ లైన్ లో అప్లయిచేసిన ప్రతి ఒక్క పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లను మంజూరు చేయాలని,ముందు ముందు యూట్యూబ్ ఛానల్స్ మరియు ఆన్ లైన్ వెబ్ లో పని చేస్తున్న వాొరికి కూడా అక్రిడేషన్లలో అవకాశం కల్పించాలని కల్లూరి శ్రీవాణి ప్రభుత్వాని పత్రికా ముఖంగా తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేపాగా ప్రపుల్ల శ్రీకాంత్, మండల ఇంఛార్జి మన్నే శ్రీనివాసరావు మండల కార్యవర్గం పాల్గొన్నారు