Breaking News

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. కరోనా వైరస్ బారిన పడకండి.. వీరవల్లి వైద్యాధికారి డాక్టర్ శిరిషా

బాపులపాడు (తెలుగు తేజం ప్రతినిధి):బాపులపాడు మండలం వీరవల్లి పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకు నో మాస్క్ – నో సేల్ అంటూ అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పిల్లా అనిత , పాలక వర్గ సభ్యులు పిల్లా రామారావు , పంచాయతీ ఈవో శ్యామలరావు పాల్గొన్నారు. మాస్కు ధరించకుండా దుకాణాలు వచ్చే వారు మాస్కు ధరించకపోతే సరుకులు అమ్మవద్దని హెచ్చరించారు వైద్యాధికారి శిరిషా అన్నారు. . వ్యాపార దుకాణాలు వచ్చే ప్రతి వినియోగదారుడికి తప్పనిసరిగా మాస్కు ధరించాలి , సామాజిక దూరం పాటించి వస్తువుల కొనాలని వ్యాపారస్తులు గట్టిగా చెప్పాలని సర్పంచ్ అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లా అనిత, పాలక వర్గ సభ్యులు పిల్లా రామారావు , పంచాయతీ ఈవో శ్యామలరావు , గుమస్తా కాలీషా హెచ్ వో మంగతయారు ,ఎంపిహెచ్ వో స్వామి , శ్రీనివాసరావు ఏఎన్ ఎమ్ కమలకుమారి , డిజిటల్ అసిస్టెంట్లు శ్రీహరి , వెల్ఫేర్ అసిస్టెంట్ శివనాగరాజు , కానిస్టేబుల్ చిరంజీవి , జూనియర్ అసిస్టెంట్ ధరసింహారావు , పంచాయతీ సిబ్బంది నరసింహారావు , శివ అశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *