వత్సవాయి ( తెలుగుతేజం ప్రతినిధి): ప్రజా సంక్షేమమే తన లక్ష్యం డివిజన్ పరిధిలో ఏ గ్రామంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే తక్షణమే ఆ గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కార దిశగా తన తోటి సిబ్బందితో కలిసి ముందుకు వెళుతున్న డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి ఆదివారం మండలం లోని ఖమ్మంపాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పాడు గ్రామం లో కొంత మంది ప్రజలు వాంతులతో ఇబ్బంది పడుతున్నారని, గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చానని అన్నారు. గ్రామంలోని మెడికల్ క్యాంపులను, వాటర్ ట్యాంక్ ను, బోరును, పరీక్షించి సంబంధిత అధికారులతోను, నాయకులతో ను, మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కొన్ని కుటుంబాల వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎవరికి అపాయం జరగకపోవడంతో మెడికల్ సిబ్బంది ని, పంచాయతీ సిబ్బంది ని తమ తోటి సిబ్బందిని అభినందించారు. మండల స్థాయి అధికారులు అందరూ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి ఆ వద్దని గ్రామస్తులందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, స్థానిక ఎస్ ఐ మహా లక్ష్మడు పంచాయతీ సిబ్బంది, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.