- సి .ఐ .మోహనరెడ్డి ,యరడ్ల ఆంజనేయరెడ్డి ,అబ్దుల్ అర్షద్ చేతులమీదుగా బాబా వారి భక్తులకు …పేదలకు …. అన్నం వడ్డించటం జరిగింది….
- సమస్త మానవాళి కోసం ప్రతేక ప్రార్ధనలు నిర్వహించటం జరిగింది
విజయవాడ తెలుగు తేజం ప్రతినిధి: బెజవాడ నడిబొడ్డులో కృష్ణ బ్యారేజి వద్ద వందల సంవత్సరాల క్రితం వెలసిన ఆధ్యాత్మిక మహాత్ములు సృష్టికర్త ముద్దు బిడ్డలు మహమ్మదీయ వంశీయులు . హజరత్ సయ్యద్ అలీ హుస్సేన్ షా ఖాదరీ ,హజరత్ సయ్యద్ షా ఖాదరీ మహాత్ముల వారి దర్గాలకు ఎంతో చరిత్ర వుంది.బాబాల పేరుమీద ప్రతి శుక్రవారం లంగర్ (ప్రసాదం )అన్నదానం నిర్వహించటంఎంతోబహూత్తరమైన మైన కార్యక్రమమాని పేర్కొన్నారు . ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై దర్గా యొక్క విశిష్టతనుకొనియాడారు ఈ సందర్భంగా 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డిమాట్లాడుతూ ఎంతో ప్రచీనమైన దర్గాలో ప్రతి శుక్రవారం లంగర్ కమిటీ వారు ఒక పండుగ వాతావరణం లో లంగర్ నిర్వహించి ఎంతోమంది భక్తులకు బాబా వారి ప్రసాదం పంపిణి చేయటం .పేదలకు అన్నదానం చేయటం ఒక బహుతరమైన కార్యక్రమం అన్నారు.దర్గా అభివృద్ధి విషయం స్థానిక దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీవాసరావు దృష్టికి తీసుకువెళ్లి కృషిచేయటం జరుగుతుందని అయన పేర్కొన్నారు .అనంతరం టూటౌన్ సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముల వారి దర్గాలను సందర్శించుకోవటం చాల ఆనందంగా వుంది .ప్రతి ఒక్కరు భాద్యతగా సేవాకార్యక్రమాలు చేయాలి … మనం నాలుగురికి ఉపయోగ పడే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చెయ్యాలి . ప్రజలందరికి ఉపయోగ పడే విధంగా నడుచుకోవటం మనకు భగవంతుడు ఇచ్చిన ప్రతేక వరం గా భావించాలి అని పేర్కొన్నారు
54డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం లంగర్ నిర్వహించి ఎంతో మంది భక్తులకు ..పేదలకు అన్నదానం చేయటం విశేషం ..అదే విధంగా ప్రాచీనమైన దర్గాలో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవటం చాల బాధ కరమైన విషయం, దర్గాలో భక్తులు కింద కూర్చోవటానికి స్థలంలేదు …అంతబురద మాయామే ఈయొక్క దర్గాలో ఇప్పటివరకు జరిగిన విషయాలను . ఇక్కడకు విచ్చేసిన భక్తులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి భక్తులందరికీ ఉపయోగ కరంగా దర్గాను శోభామయంగా తీర్చిదిద్ది సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు