పెడన :పెడన మండలం, 4వ వార్డు కు చెందిన అబ్దుల్ గఫార్ అనే యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, కొంత నగదు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కూడిన పర్సు పెద్ద మసీదు ప్రాంతంలో దొరకగా, సదరు పర్సును పెడన పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అంతట పెడన ఎస్ఐ పల్లా నాగ కళ్యాణి సదరు గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ పర్స్ మచిలీపట్నం, జవ్వారు పేట కు చెందిన K. మెహెర్ సాయి అనే యువకుడిగా గుర్తించి, అతనికి సమాచారం ఇచ్చి సదరు పర్సు ను అబ్దుల్ గఫార్ చేతుల మీదగా అతనికి అప్పగించారు. అంతట తనకు దొరికిన పర్సు ను ఎంతో నిజాయితీగా అప్పగించిన అబ్దుల్ గఫార్ ను పెడన ఎస్ఐ పల్లా నాగ కళ్యాణి అభినందించారు.