దేశంలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,805 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో గడచిన 134 రోజుల్లో దేశంలోని కరోనా కేసులు 10,000 మార్కును చేరుకున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం 10,300 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రోజువారి పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉందని, రికవరీ రేటు 98.79 శాతంగా ఉందని తెలిపింది.