నంద్యాల: తన అరెస్టుపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. నేనేం తప్పు చేశాను? ఆధారాలేవీ అని అడిగా. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు’’ అని తెలిపారు.
కేసుతో సంబంధం లేని సెక్షన్లు పెట్టారు: చంద్రబాబు న్యాయవాది
‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు’’ అని టిడిపి అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 37వ ముద్దాయిగా పేర్కొన్నారు. కేసుతో సంబంధం లేకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు’’ అని న్యాయవాది చెప్పారు