Breaking News

టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్ట్

నంద్యాల : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అల్పాహారం పూర్తయిన తర్వాత విజయవాడ తరలించడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలించనున్నారు. ఈ సందర్బంగా నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో అరెస్ట్‌ చేయవచ్చన్న వార్తలకు బలం చేకూరింది. పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను నంద్యాలకు పంపనున్నారన్న వార్తలతో మరిన్ని అనుమానాలు పెరిగాయి. అరెస్ట్‌ ప్రచారం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చంద్రబాబును విజయవాడకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *