అమరావతి : ఎంకిపెళ్లి సుబ్బు చావుకి రావడం అంటే ఇదేనేమో..? ఆంధ్రప్రదేశ్ లో పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ వార్ లో పోలీసులు టార్గెట్ అవుతున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడి అరెస్ట్ తరువాత.. ఆ పార్టీ నేతలు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. అటు అధికార పార్టీ నేతలు సైతం పోలీసులపై ఒత్తిడి తెస్తుండడంతో.. ఇరకాటంలో పడుతున్నారు. ఒక్కొక్కడికి పగిలిపోద్ది.. చెప్పు తీసి కొడితే తెలుస్తుంది. ఇది ప్రస్తుత నేతల మాటల తూటాలు.. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పడరాన్ని కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల పోలీసులు హుందాగా ఉండి వారు చెబుతూ పరిస్థితి నీకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల పోలీసులకు ఎదురు మాటలు ఎదురవుతున్నాయి. చట్టంపై నమ్మకం ఉంది.. న్యాయమే గెలుస్తుందని కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడికక్కడ ఆగిపోయి వెనక్కి తిరుగుతున్నప్పటికీ కొన్నిచోట్ల రోడ్డు పైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనిరసన కార్యక్రమాలు ఎలా ఉన్నా హౌస్ అరెస్ట్ చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జ్ లు లేక మాజీ ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు వెళ్లారా అయ్యింది వారి పని అన్నట్టుగా తయారయింది నేటి పరిస్థితి. పాపం ప్రజా ప్రతినిధులు మీద ఉన్న కోపమంతా పోలీసులమీద ల చూపిస్తున్న జిల్లాలో కనిపిస్తుంది.. నిజానికి సిఐ క్యాడర్ వ్యక్తి హోంగార్డు లేక కానిస్టేబుల్స్ ఏం చెప్తే అదే చేస్తారు ఒక మాజీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లాలన్న ఆ నివాసం చుట్టూ ఉండాలన్న సిఐ అదే విధంగా ఎస్సై అనుమతితో చేస్తుంటారు. అలాంటి సందర్భంలో అక్కడ పోలీసులపై మాజీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వద్దకు వెళ్లి పోలీసులు అయితే మాటలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కనిపించే ఈ మూడు సింహాలు తల ఎప్పుడు ఎత్తుకునేలా చేసే పోలీస్ లు ఈ మధ్యకాలంలో బడా నేతలు హౌస్ అరెస్ట్ పేరుతో వారి వద్దకు వెళ్లినప్పుడు ఏం చేయాలో తెలియక పాపం సతమతమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.