• షరతులు వర్తిస్తాయి
అమరావతి: రాష్ట్రంలోని అక్రెడిటెడ్ జర్నలిస్టులకు కొన్ని షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని, మిగిలిన 40% జర్నలి స్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుతం అక్రెడిటేషన్ కలిగి ఉండి… మీడియాలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న నివాసం ఉంటున్న జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్ గా ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణా లకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షరతులు: స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది. ఇల్లు కట్టు కుని ‘ఫిజికల్ పొజిషన్’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు. దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ప్లాట్ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట ఉండకూడదు. * గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్ యూలలో పని చేస్తున్నా అనర్హుల వుతారు. సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.