రాష్ట్రంలో చాపకింద నీరులాగా అమూల్ పాల కంపెనీ ఉత్పత్తి ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వస్తుందని,దీని ద్వారా విజయ,సంగం లాంటి పాడి రైతులతో నాణ్యమైన,నమ్మకమైన డైరీ ఫాం ను నాశనం చేయడానికే రాష్ట్రంలోకి అమూల్ ను తీసుకొని వస్తుందని సిపిఐ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు విమర్శించారు.జగ్గయ్యపేట లాంటి ప్రాంతాలలో సైతం పాడి రైతులు ఈ ప్రాంతంలో అమూల్యకు లేనపట్టికి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలల్లో ఇస్తున్న ప్రభుత్వ స్థలాలలో అమూల్ పాల డైరీకి పాల సేకరణ నిమిత్తం ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ప్రభుత్వం ప్రాణాళికా బధంగా స్వరాష్ట్ర పాల డైరీ కంపెనీలను అమూల్య పాల డైరీకి అప్పగించే కుట్రలు చేయడం,లాభాలలో ఉండే విజయ,సంగం లాంటి పాల డైరీలను గుజరాత్ కంపెనీలకు అప్పగించడం,దీనిని బట్టి రాష్ట్రాంలో ఉండే కంపెనీలను ఇతర రాష్ట్రాలకు అప్పగించడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైన ప్రభుత్వం అమూల్ పాల కంపెనీ డైరీకి అప్పగించిన స్థలాలను వెంటనే జిల్లాలో నాణ్యమైన పాల సేకరణకు,ఉత్పత్తి ని అందిస్తున్న విజయ పాల డైరీ సేకరణ కేంద్రాలకు అప్పగించాలని,మరింత సేవలను విజయ పాల ఉత్పత్తి చేసే పాడి రైతులకు మరియు విజయ పాల డైరీ ని ప్రభుత్వం మరింత పటిష్టం చేయాలని సిపిఐ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ప్రకటన ద్వారా ప్రభుత్వాని డిమాండ్ చేసారు.