వివాహ వేదిక పైన తమ వంతు విరాళం అందించిన నూతన వధూవరులు నరేంద్ర బాబు దంపతులు
తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్య పేట మండల పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో తమ బంధువర్గ వివాహ వేడుకల లో పాల్గొన్న పెద్దలు మన్నె శ్రీనివాసరావు ప్రఫుల్ల శ్రీకాంత్ కిషోర్ బాబు కొద్దిరోజులుగా అయోధ్య రామ జన్మభూమి రామమందిర నిర్మాణ నిధి సేకరణ కై గ్రామ గ్రామాల్లో తిరుగుతున్న విషయం తెలుసుకుని తమ వివాహానికి విచ్చేసి ఆశీర్వదిస్తున్న తరుణంలో తాము కూడా అయోధ్య రామ మందిరానికి తమ వంతు విరాళం ఇస్తామంటూ దంపతులు ముందుకు వచ్చారు వెంటనే తమ విరాళాన్ని మన్నె శ్రీనివాసరావు ప్రపుల్ల శ్రీకాంత్ కిషోర్ బాబు బృందానికి అందజేశారు నూతన వధూవరులు శ్రీరాముని పై తమకున్న భక్తిని చాటుకున్నారు షేర్ మహమ్మద్ పేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది సుందర్ రావు తో పాటు పాస్టర్ నవీన్ నూతన దంపతుల తల్లిదండ్రులు పాల్గొన్నారు