హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది. రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తిన చివర్లో వేగం పెంచి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి నుంచి వేగంగా పరుగెత్తి రిరికా హిరోనకా (జపాన్) చివర్లో శక్తిని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. సోమవారం మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళల జావెలిన్‌త్రో ఫైనల్లో అన్నురాణి (62.92 మీ) ఈటెను విసిరి స్వర్ణం అందుకుంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య రామ్రాజ్ (55.68 సె) కాంస్య పతకం అందుకుంది. పురుషుల 800 మీ ఫైనల్లో మహ్మద్ అఫ్సల్, డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రజత పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్‌జంప్ ఫైనల్లో ప్రవీణ్ (16.68 మీ) కాంస్య పతకం అందుకున్నాడు. పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్లో భారత్‌కు పతకాలు రాలేదు. పాలక్‌షా ఐదో స్థానంలో, సంతోష్ కుమార్ ఆరో స్థానంలో నిలిచారు. మహిళల హైజంప్‌లో ఫైనల్లో పుజా ఆరు, రుబీనా తొమ్మిదో స్థానంలో నిలిచారు.