ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లును ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
యన్ జీ ఓ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, ఏ.విద్యాసాగర్,
తెలుగు తేజం, విజయవాడ : కరోనా దృష్ట్యా ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఎన్ న్జీవో అసోసియేషన్ డిమాండ్ కు అనుగుణంగా రాష్ట్ర హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేయడం శుభపరిణామమని ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ధృక్పధంతో స్పందించి త్వరలో వాటికి పరిష్కరించాలని ఏపి యన్ జివో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర రెడ్డి అన్నారు.
ఏపి యన్ జివో అపోసియేషన్ పశ్చిమ కృష్ణాశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఏ.విద్యాసాగర్ అధ్యక్షతన సోమవారం విజయవాడలోని ఏపి యన్ జీవో హోమ్ నందు నిర్వహించారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన తొలినాళ్ల నుండి ఇప్పటివరకు కరోనారోగులకు సేవలు అందించిన ఎంతో మంది ప్రముఖ ఉద్యోగులు వ్యాధి బారిన పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంపట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు.
ఎన్నికలు నిర్వహిస్తే విధులను బహిష్కరించాలని రాష్ట్ర సంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై సానుకూల ధృక్పధంతో ఉన్నప్పటికే వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
యన్ జివో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అమల్లో ఇప్పటికే తీవ్రజాప్యం జరిగిందన్నారు. వెంటనే పిఆర్ సి అమలు పై ప్రభుత్వం త్వరలో
ప్రకటన చేయాలని కోరుతున్నామన్నారు. సిపియస్ విధానాన్ని రద్దుచేసి, పాత విధానాన్నే అమలు చేస్తామన్న
ముఖ్యమంత్రి హామీని అమలుపరిచి సిపియస్ ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
చేస్తున్నామన్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చులు మరియు వివాహాలు వంటి శుభకార్యక్రమాల కొరకు జపియఫ్, ఏపిజియల్ ఐ ఖాతాలనుండి రుణసహాయానికి ధరఖాస్తు చేసుకోవడం జరిగిందని అవి మంజూరై నెలలు
గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారి ఖాతాల్లో మంజూరైన మొత్తాలు జమ చేయకపోవడంపట్ల ఉద్యోగులు
ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం వెంటనే మంజూరైన మొత్తాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేవిధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో మనో ధైర్యాన్ని నింపిందని ఇక పై ఉద్యోగులు ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై నిమగ్నమవ్వాలన్నారు. ప్రజలకు వ్యాక్సినేషన్ అందిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తే మరింత
సమర్ధవంతంగా ఎన్నికలు విధులు నిర్వహించడంలో ఉద్యోగులు సిద్ధంగా ఉంటారని విద్యాసాగర్ తెలిపారు.
సమావేశంలో పశ్చిమ కృష్ణ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు యండి. ఇక్బాల్, పి.రమేష్, సిహెచ్. శ్రీరామ్,యం రాజుబాబు,యం. ప్రకాష్ బాబు, ఆర్.శ్రీనివాసరావు, జి. రామకృష్ణ, వి. సతీష్ కుమార్, డి. విశ్వనాధ్, సిహెచ్. మధుసూధన్, మహిళా ప్రతినిధులు యన్. హేమకళ్యాణి, కె. శివలీల, సిటి కార్యవర్గ సభ్యులు జె.స్వామి, కె.సంపత్ కుమార్, వి.వి.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.