సినీ నేపధ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యావత్ భారతాన్ని ఆకట్టుకున్నారు.. తెలుగులోనే కాదు.. దేశంలోనే దాదాపు అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత ఆయన సొంతం.. ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను వదిలేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. కోలుకుంటున్నారని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో సెప్టెంబర్ 25న కన్నుమూశారు బాలు. అయితే, ఎస్పీ బాలుకు భారత ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. దివంగత ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మ విభూషన్ బిరుదుతో సత్కరించిన భారత ప్రభుత్వం. గానగంధర్వుడు భౌతికంగా మనమధ్య లేకపోయిన మన మనస్సులో ఎన్నటికీ నిలిపోతారని ఆయనను గుర్తు చేసుకున్నారు. అయితే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఇదిలా ఉంటే నేడు భారత ప్రభుత్వం ఏడుగురిని పద్మవిభూషణ్, పది మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులతో సత్కరించారు. ఈ విషయం పై ఆయన అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.