ఒక్క రోజే 3,648 మందికి ఇళ్ల పట్టాలను అందజేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
పట్టాతో పాటు చీర, గాజులు, పసుపు, కుంకుమ కూడా..
తెలుగు తేజం, మైలవరం : గొల్లపూడి గ్రామానికి చెందిన పేదలకు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు జిల్లాలోని సహచర శాసనసభ్యుల సమక్షంలో సోమవారం వైభలంగా జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించిన అనంతరం మంత్రులు, సహచర శాసనసభ్యులు నందిగామ లో ఏర్పాటుచేసిన ఇదే కార్యక్రమానికి వెళ్లిపోగా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గోల్లపూడి గ్రామానికి చెందిన నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంబించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు 3600 మంది లబ్ధిదారుల పేర్లను మైక్ లో స్యయంగా చదువుతూ వారికి శుభాకాంక్షలు తెలపగా స్థానిక నాయకులు లబ్ధిదారులకు ఇంటి పట్టాలతో పాటు చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు కూడ అందజేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన పట్టాల పంపిణీ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతునే ఉంది ఈ కార్యక్రమం లో యార్డు చైర్మన్ కారంపూడి సురేష్, దూళిపాళ శ్రీనాద్, శ్రీకాంత్, జాస్తి జగన్ , గంగవరపు శీవాజీ , ధనేకుల చౌదరి , వేమూరి సురేష్ , బోర్రా తిరుపతిరావు, వెంకట్రావు, వడ్లమూడి నాని , అలపాటి సుబ్బారావు , చిట్టినేని శ్రీనివాసరావు, నంద్యాల దుర్గారావు స్థానిక నాయకులు పాల్గొన్నారు.